Revanth Reddy: శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం రేవంత్..! 18 d ago
ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాలలో భాగంగా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్ లో కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఫారెస్ట్ అండ్ ఎకో టూరిజం డెవలప్మెంట్ ఆఫీస్కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం బ్యాటరీ వాహనంలో బొటానికల్ గార్డెన్ ను రేవంత్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, అధికారులు పాల్గొన్నారు.